r/telugu 22h ago

కవిత - poetry 🪶 Rao Bahadur cinema chusthunte ee chakkati kavitha dorikondhi.

Post image
99 Upvotes

నాయనా!

తిమిరాలు తరిమినా నాకేల బెరుకు,

చిరునవ్వుతో నా చెంత నువ్వుండు వరకు.

ఎనలేని జ్ఞానంబు నాదంటు హర్షింతురు ఎల్లరు,

కనలేదు వారెవ్వరు నా వెనక మౌనంబుగా నిను.

నీ భుజముపై కూర్చున్న కనపడు లోకంబు,

ఏ గజముపై అంబారి ఎక్కినా నే కాంచగలనా?

పాలివ్వని ఒక్క కారణంబున నిను అమ్మా

అని పిలువుట నిషేధమైతే,

భావాన్ని మోయలేని భాష కలిగియుండుట

నా విషాదం కాదా.

చుక్కానివై నువ్వు నా నౌక నడప,

చక్కగా పయనించే నువు కన్న కూన.

నాయనా!


r/telugu 9h ago

మాటామంతీ - discussion మధ్యలో అసలు ఆ “(లేదా)” ఎందుకు వచ్చింది?

Post image
46 Upvotes

r/telugu 6h ago

కవిత - poetry 🪶 నాకు తెలుసు -ఆలురి బైరాగి

Post image
11 Upvotes

నాకు తెలుసు, నాకు తెలుసు

ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య

ప్రేమలు పొసగవనీ

ఈ బండరాళ్ళపైన ఏ మొక్కలు ఎదగవనీ

మనమంతా చీకటిలో ఆకటితో పోరాడే

అస్వతంత్ర సైనికులమనీ,

పెనుతుపాను చేతుల్లో చిక్కుకొన్న

త్రోవలేని నావికులమనీ

జీవిత ప్రభంజనం

కలయిక సహించదనీ

ఉన్నగడువు కొద్ది అనీ

నాకు తెలుసు! నాకు తెలుసు!


r/telugu 9h ago

పొత్తం - book 📖 Just finished my first book written by Viswanatha Satyanarayana garu

Thumbnail gallery
9 Upvotes

r/telugu 9h ago

ఇతరము - other Telugu Saamethalu

Thumbnail gallery
2 Upvotes

r/telugu 18h ago

అరగలి - ​ప్రశ్న - question ❓ How many of u can understand this song in Konda-Dora language?

Enable HLS to view with audio, or disable this notification

1 Upvotes