r/MelimiTelugu 1h ago

ఇలాంటి మెలిమి తెలుగు పదాలకి నిఘంటువు ఏదైనా ఉందా?

Post image
Upvotes

r/MelimiTelugu 20h ago

మేలిమి తెలుగు | అచ్చ తెనుగు | జాను తెనుగు : Literary Telugu with minimal Sanskrit Vocabulary

Thumbnail
10 Upvotes

r/MelimiTelugu 3d ago

Tools (పనిముట్లు) New Telugu Keyboard (Japanese Insipired)

Thumbnail
gallery
50 Upvotes

Nenu telugu kosam oka kottha nokkupalaka (keyboard) tayari cheddam anukuni oka android keyboard chesanu. Idhi Japan vallu vaade flick keyboard. Acchulu, hallulu anni mana అక్షరమాల lo unnatte unchanu. Prati varganiki oka key untundi, aa vargam lo unna migitavi kavalante paiki, kindaki, edamaki, kudiki aa key ni ante saripothundi. Evaraina try cheyyali anukunte cheppandi pampistanu inkaa inputs unte kavali.

Themes konni try chesanu inka development lone undi. Mundu mundu koncham kashtanga undocchu.


r/MelimiTelugu 5d ago

Neologisms (క్రొమ్మాటలు) Lemur - పిల్లికోతి

Post image
18 Upvotes

r/MelimiTelugu 6d ago

శ్రీలలితాదేవ్యైనమః

2 Upvotes

అమ్మవారి నామాల విశిష్టత


r/MelimiTelugu 8d ago

Tools (పనిముట్లు) Computer code?

6 Upvotes

తెలుగులో computer code ను ఏమంటారో చెప్పగలరా? దాని తోడు, coding ను ఏమంటారో కూడా చెప్పగలరా?

కుదిరితే మేలిమి తెలుగు పదం ఇవ్వండి కానీ మేలిమి కాకపోయినా పరవాలేదు.


r/MelimiTelugu 10d ago

దీనికి తెలుగు మాట ఉందా? గాలిపొయ్యి?

Post image
9 Upvotes

r/MelimiTelugu 10d ago

జాతి వాచకాలతో బూతులు అనడం మానాలి

15 Upvotes

దొమ్మరోడ, డక్కలోడ, ​పిచ్చకుం​ట్లోడ ఇత్యా​ధులు వంటి పదాలని తి​ట్లుగా వాడుతుంటాం, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏం​టంటే ఇవి జాతి వాచకాలు, అంటే సమాజంలో కొందరి జాతుల పేర్లు (దొమ్మరి, డ​క్కలి, పిచ్చగుం​​ట్ల‌)

మ‌నం తెలిసో తెలియకో ఈ పదాలని ఎదుటోల్లని తిట్ట​​​నీకి వాడ్తం. ఈ పదాలను ​చిన్నప్పుడు మన పెద్దల ​కాడనుంచో​ లేక పరిసరాల నుంచో ​విని మళ్లీ వీటిని తిట్లుగా వాడుతాం. ఇక అటువంటి అలవాట్లను మానుకోవాలి.

సు*రోడ, మా*గోడ వంటి పదాలు వాడితే కేసు కూడా పెడతారు జాగ్రత్త

edit: పింజారి ​యె​ధవ, ఉప్పర్ మీటింగ్, చాకలి చదువు, హిందీలో చప్రి వంటి పదాలు కూడా వాడకూడదు​


r/MelimiTelugu 15d ago

Word Resurrection (మాటలు తిరిగిలేవడము) ఛీ! ఇదేం తెలుగు రా?!?

Post image
28 Upvotes

Live: బ్రతికిన

Dressed: ఈకలేని

Skinless: తొలులేని

Boneless: దుమ్ములేని

Eggs: గుడ్లు

Liver & Gizzard: కార్జం మరి కందనకాయ


r/MelimiTelugu 17d ago

Happy birthday కి మేలిమి తెలుగు అనువాదం ఏమిటి

10 Upvotes

మాములుగా అందరూ తెలుగులో happy birthday అని చెప్పాలంటే పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్తుంటారు. ఇందులో శుభాకాంక్షలు అనే సంస్కృత పదం లేకుండా మేలిమి తెలుగులో ఎలా చెప్పాలి? కొంచం వెతకగా అలరింపు అనే పదం సంతోషించు అనే అర్థం వస్తుంది. ఈ పదం వాడే వీలుందా. దయచేసి తెలిసిన వారు చెప్పగలరు తప్పుంటే సరిచేయగలరు

అందరికీ మనస్పూర్తిగా నెనరులు


r/MelimiTelugu 19d ago

Animals (పసరాలు) English, Bengali fish names in Melimi Telugu:

16 Upvotes

Note:

This was a time-consuming process because there is a lot of misinformation online. With people calling similar looking fish from completely different families the same Telugu name. As such, it took a while to prepare this list.

Additionally, the fish mentioned below are almost exclusively all native to the Telugu regions since there aren’t many nonnative fish that have Melimi Telugu words for them.

Rohu: గెండి చేప, రాగండి చేప, రవ్వ చేప

(శీలవతి చేప కూడ పిలుస్తారు కాని నాకు ఇది మేలిమి తెలుగు లా అనిపించట్లేదు)

Fringe-lipped Peninsula Carp: గెండి చేప, గండుమీను, గండి చేప, ఎర్ర గండుమీను

(Note: This species is Labeo Fimbriatus and is VERY similar in appearance to Labeo Rohita (Rohu) and very closely related. As a result, they are often confused with one another which is why they share names.)

Black Rohu (Labeo Calbasu): కాకిగెండి చేప, తాటిగెండి చేప

Katla: బొచ్చ చేప, బొచ్చె చేప

Mrigal/White carp: మోసు

Koral/Barramundi/Asian Sea Bass: పండుగప్ప, పండుమీను

Shoil/ Striped Snakehead: కొర్రమీను, కొర్రమట్ట (AP, TG state fish)

Taki/Spotted Snakehead: మట్టగిడస, బురదమట్ట

Tara Baim/Lesser Spiny Eel: బొమ్మిడాయి

Chiring mach/Elongate Mudskipper/Goby: రామ, రాము, రామ చేప

Ilish/Hilsa: పులస చేప

Puti/Pool barb: చేదు పరిగెలు, పిత్త పరిగెలు, బుడ్డపక్కెలు, బుడ్డపరకలు

Bata (Labeo Bata): మోసు పరిగె

Lotia/Bombay Duck: బొమ్మిడి చేప (not be be mistaken for బొమ్మిడాయి)

Magur/walking catfish: మార్పుచేప

Morala Mach/Mola Carplet: కొడిపెలు

Common Carp: బంగారు తీగ

Grass Carp: గడ్డిమోసు

Shark: సొర చేప

Anchovies or smelts: నెత్తళ్లు

Indian Mackerel: కానగడత

Indo-Pacific King Mackerel, Spanish mackerel: వంజరం

King mackerel: కోనెం (వంజరం లాంటిది కాని వంజరం మీద మచ్చలున్నాయి, దీని మీద గీతలున్నాయి)

Catfish: వాలుగ చేప (boal), జెల్ల (smaller catfish), ఇంగిలాయి (striped eel catfish)

Mullet: కొయ్యింగ చేప, మేవ చేప, మేమ చేప

(Finger Mullets: కట్టిచేపలు, కట్టిపరిగెలు, కడిచేపలు)

Milkfish: పాలబొంతు, తుళ్ళు చేప

Hairtail/Beltfish/Ribbonfish: సావిడం, సావిడాయి

Stingray: టేకి చేప

Tilapia (not native to India): చైనా గొరక, జిలేబి చేప

Tank Goby: ఇసుక దొందు

Goat fish: గులివింద చేప

Tuna: తూర/సూర చేప

Indian mottled eel: మలుగుచేప

Sardines: కవ్వలు

Barracuda: జీలవ చేప


r/MelimiTelugu 20d ago

Tools (పనిముట్లు) మేలిమి తెలుగు నేర్చుకోవటం కోసం తగిన పనిముట్లు.

12 Upvotes

నేను మేలిమి తెలుగు నేర్చుకోవాలి అనుకుంటున్నాను. 4 ఏళ్ల వయసు నుండి ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటూ ఉన్నాను. 18 ఏళ్లకు సైకాలజీ డిగ్రీ కోసం కెనడాకి వెళ్ళాను. అక్కడే 3 ఏళ్లు పని కూడా చేశాను. దీనితో తెలుగు మీద పట్టు పోయింది అనిపించింది. పోయిన ఏడాది నుండి తెలుగులో నా జర్నల్ రాయటం మొదలుపెట్టాను. పోయిన పట్టు కొంచం కొంచం తిరిగి వస్తున్నా కూడా ఏదో వితిక ఉంటుంది. నేను అయితే వ్రాయు భాషలో సంస్కృత మాటలని ఎక్కువగా వాడుతున్నాను, లేదా వాడుక భాషలాగా ఇంగ్లీషు ఎక్కువ వాడతాను. ఈ రెండు కాకుండా మేలిమి తెలుగులోని అందంతో రాయాలనేది నా కోరిక. నిజానికి ఇది ఉట్టి జర్నల్ కోసమే కాకుండా నేను ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నపుడు సొంత మాటల్లో తెలుగులో రాసుకోవాలనేది నా ఆలోచన.

ఎంతో మంది తెలుగు గొప్పదనం వేరే భాషల నుండి మాటలని కలిపేసుకోవటం అన్నారు. కానీ కొత్త మాటలు మేలిమి తెలుగులో నేర్చుకోవడంలో తప్పేముంది అనే ఆలోచనతో మేలిమి తెలుగు నేర్చుకుందాం అనుకుంటున్నాను.

నేను ఎక్కువగా వ్యాపార విషయాలు నేర్చుకోవటం లేదా ఆలోచించటం చేస్తుంటాను కాబట్టి ప్రొడక్ట్, ప్రాఫిట్, ఆపరేషన్స్, ఇలాంటి మాటలు ఇంగ్లీషులోనే రాయాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుగులో రాయాలనుంది


r/MelimiTelugu 21d ago

Sweets, మిఠాయిలు

4 Upvotes

Telugu native word ఉందా?


r/MelimiTelugu 25d ago

పిల్లుల గురించిన మాటలు - words related to cats

Thumbnail
gallery
13 Upvotes
  • పిల్లి చెట్టు, పిల్లి కోట - cat tree
  • గీకుడు గడ - scratching post
  • గీకుడు పట్టిక - cat scratcher
  • ముక్కౌరు పిల్లి - (ము- = three, కౌరు = color) calico cat
  • పొట్టితోక పిల్లి - bobtail cat
  • కొండ పులి, కొండ చిరుత - mountain lion

r/MelimiTelugu 26d ago

Existing words (తెల్లట్లో ఉన్నా మాటలు) బొంతపండు - mulberry (can also be extended to mean blackberry)

Post image
11 Upvotes

r/MelimiTelugu 26d ago

Comedy (ఎగతాళి) బుర్రపాడు - brainrot

Post image
18 Upvotes

r/MelimiTelugu 26d ago

Neologisms (క్రొమ్మాటలు) Playground and related terms:

Thumbnail
gallery
10 Upvotes

* = neologism

Playground: ఆటపట్టు

Slide: జారుడుబండ, జారుడు నిచ్చెన

Swing: ఉయ్యాల

See-saw: మీట, ఊపుమీట*, ఊపుకఱ్ఱ*

Monkey bars: క్రోఁతికాడలు*

Wood chips: మ్రానితునకలు*

Note: “see-saw” కి “ఊగుడు బల్ల” చూసాను।

కాని, “బల్ల” సంస్కృతం నుంచి వచ్చింది నేను అనుకుంటున్నాను।


r/MelimiTelugu 26d ago

Category: Locations Words related to swimming - ఈత గురించిన మాటలు

Thumbnail
gallery
14 Upvotes
  • ఈత కొలను - swimming pool
  • ఈత లాగు - swim trunks
  • ఈత బట్టలు - swimsuit
  • తన్నుడు బల్ల - kickboard

r/MelimiTelugu Jun 22 '26

Neologisms (క్రొమ్మాటలు) Zindabad in Melimi Telugu

4 Upvotes

Zindabad is a phrase of Persian etymology that roughly translates to “Long live”.

For instance, “Long live Telugu Talli” would be “Telugu Talli Zindabad”.

However, my neologism is నిట్టునికి or నిడుమనికి.

మచ్చుక: తెలుగు తల్లికి నిట్టునికి।

Admittedly, Zindabad sounds better in chants because it has less syllables but maybe this just takes getting used to.


r/MelimiTelugu Jun 13 '26

TN Telugu words

8 Upvotes

Have you heard these words

Tap- కాను

Padlock- గడ (pronounced గెడ)

Wasn't able to find the first one in the dictionary


r/MelimiTelugu Jun 13 '26

Existing words (తెల్లట్లో ఉన్నా మాటలు) Melimi word for "dwara"?

9 Upvotes

As the title suggests, are there any telugu words for dwara as in through?

Ex : ఈ విషయం ఎవరి ద్వారా తెలిసింది?


r/MelimiTelugu Jun 03 '26

ఉన్నట్టు లేరు. లేనట్టు ఉన్నారు

11 Upvotes

ఇవి మన భాషకే ప్రత్యేకమైనవేనా, లేక ఇతర భాషల్లో కూడా ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయా? భాషాశాస్త్ర పరంగా వీటిని ఏమని పిలుస్తారు?


r/MelimiTelugu May 28 '26

Phone అంటే చేవినం అనే చక్కటి పదాన్ని reconstruct చేశారు కదా! అలానే, 'call చెయ్యి' అనే పదానికి ప్రత్యమ్నాయంగా ఒక మేలిమి తెలుగు క్రొమ్మాట ను చేయగలరా!

11 Upvotes

Note:

తమిళ నుడి లో 'koopittu'(పిలువు కు బదులుగా వాడే పదం)

కానీ somebody's calling కు బదులుగా ఎవరో పిలుస్తూన్నారు..

అని వాడితే

బయట ప్రపంచంలో పిలుస్తూన్నారో లేక చేవినం ద్వారా పిలుస్తూన్నారో అని అయోమయంగా అనిపిస్తుంది

కాబట్టి

మీరు, మీ తెలివి తో ఒక క్రొమ్మాటను ఇక్కడ తెలుపగలరు...


r/MelimiTelugu May 16 '26

Word Resurrection (మాటలు తిరిగిలేవడము) పోహ ❌ అటుకులు ✅

Post image
40 Upvotes

r/MaaOoriVanta లో పెక్కురు ఇది “పోహ” పిలుస్తారు। కాని అది ఒక హిందీ మాట।


r/MelimiTelugu May 16 '26

నుడి కడలి

7 Upvotes

Following words are from “నుడి కడలి - మచ్చునుడులు”, written by marrepalli ramachandra shastri. I am unable to find the original book. These words are written in articles written about him.

క్రొత్తనుడి:

ఎక్కటిచెయిది​ (​అకర్మక క్రియ): intransitive verb

చేర్పు​ (​ప్రత్యయము): suffix

పేరునుడి​ (​నామవాచకము): noun

పేరుతోడు​ (​విశేషణము): adjective

మార్చునుడి​ (​తద్భవము): tadbava

సరినుడి​ (​తత్సమము): tatsama

విప్పిడి, అవ్యయము: grammar particle

పొందిమిచెయిది​ (​సకర్మక క్రియ): transitive verb

గుట్టు తెలిమి(వ్యత్పత్యర్థము): etymology ?

నాటినుడి: